News

నేడు అమెరికా పర్యటనకు వెంకయ్య


కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ రోజు అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో భాగంగా జులై 1న వాషింగ్టన్‌ నిర్వహించే యూఎస్‌, భారత వ్యాపార సమాఖ్య రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన పాల్గొంటారు. జులై 3న డెట్రాయిట్‌లో తానా వార్షికోత్సవాన్ని ప్రారంభిస్తారు. అదే రోజు గవర్నర్‌ స్నియడర్‌తో కలిసి వ్యాపార సదస్సును ప్రారంభిస్తారు. 4న లాస్‌ ఏంజెలిన్‌లో తెలుగు సంఘం నాట్స్‌ ముగింపు ఉత్సవాల్లో పాల్గొననున్నారు. అదే విధంగా 5న కాలిఫోర్నియాలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు